ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్వైభవంగా మర్హూమ్ సయ్యద్ ఇర్ఫానుల్లా హుస్సేనీ ఖాద్రి సాహెబ్ కుమార్తె నిఖా

వైభవంగా మర్హూమ్ సయ్యద్ ఇర్ఫానుల్లా హుస్సేనీ ఖాద్రి సాహెబ్ కుమార్తె నిఖా

📰 Generate e-Paper Clip

 

 

–పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, మషాయిఖ్‌ సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిఖా

 

సలాం ప్రొద్దుటూరు:

ఆస్థాన-ఏ-కమాలియా బిరాదరే పీఠాధిపతి  మర్హూమ్ సయ్యద్  ఇర్ఫానుల్లా  హుస్సేనీ ఖాద్రి సాహెబ్ కుమార్తె నిఖా వేడుక ఆదివారం ప్రొద్దుటూరు ఆటోనగర్‌లోని ఎస్‌డీఎస్ ఫంక్షన్ హాల్‌లో ఇస్లామీయ సంప్రదాయాలు, సూఫీ ఆధ్యాత్మిక సంస్కృతి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు.నిఖా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, మషాయిఖ్‌లు, ప్రముఖ సూఫీ గురువులు, ఉలమాలు, మత పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక ప్రముఖుల సమక్షంలో నిఖా కార్యక్రమాన్ని ఇస్లామీయ షరీఅత్‌ సంప్రదాయాల ప్రకారం నిర్వహించి, వధూవరుల దాంపత్య జీవితానికి దువా చేశారు.ఈ సందర్భంగా పీఠాధిపతులు, మషాయిఖ్‌లు నూతన దంపతులను ఆశీర్వదిస్తూ, అల్లాహ్‌ తఆలా వారి దాంపత్య జీవితాన్ని బరఖత్‌, సుఖసంతోషాలు, పరస్పర ప్రేమాభిమానాలతో నింపాలని, వారి జీవిత ప్రయాణం సౌభాగ్యవంతంగా సాగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

పలు రాష్ట్రాల పీఠాధిపతులు, మషాయిఖ్‌ల హాజరు

 

నిఖా వేడుకకు ప్రొద్దుటూరు ఆస్థాన-ఏ-కమాలియా పీఠాధిపతి సయ్యద్ షా అబిదుల్లా హుస్సేనీ ఖాద్రి, ఆస్థాన-ఏ-కమాలియా బిరాదరీ పీఠాధిపతులు డా. సయ్యద్ షా అరిఫుల్లా హుస్సేనీ ఖాద్రి, సయ్యద్ షా ఎహ్సానుల్లా హుస్సేనీ, ఆస్థాన-ఏ-జాహురియా పీఠాధిపతులు సయ్యద్ షా ముబీన్ హుస్సేనీ ఖాద్రి, మతీన్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే కడప ఆస్థాన-ఏ-షామీరియా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పీర్ షామీరి, సయ్యద్ షా మఖ్దూమ్ షామీరి, కర్ణాటక హుబ్లీ ఆస్థాన-ఏ-బాషా ఖాద్రి పీఠాధిపతి సయ్యద్ షా తాజుద్దీన్ పీరాన్ ఖాద్రి, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ షా సాబీర్ పాషా ఖాద్రి, కర్నూలుకు చెందిన సయ్యద్ షా ఆసిఫ్ పాషా ఖాద్రి, బెంగళూరుకు చెందిన సయ్యద్ షా ముసావిర్ పాషా ఖాద్రి, సయ్యద్ షా డా. నసీముల్లా సాహెబ్, కర్నూలుకు చెందిన సయ్యద్ షా ఖుస్రూ పాషా ఖాద్రి తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరై నూతన దంపతులను దువాలతో ఆశీర్వదించారు.

నిఖా అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మురీదులు, భక్తులు, అభిమానులు నూతన దంపతులకు ముబారక్‌బాద్‌ తెలియజేశారు. పీఠాధిపతులు, మషాయిఖ్‌ల సమక్షంలో జరిగిన ఈ నిఖా వేడుక ఆధ్యాత్మికత, ఇస్లామీయ సంప్రదాయం, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!