వైభవంగా మర్హూమ్ సయ్యద్ ఇర్ఫానుల్లా హుస్సేనీ ఖాద్రి సాహెబ్ కుమార్తె నిఖా
–పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, మషాయిఖ్ సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిఖా సలాం ప్రొద్దుటూరు: ఆస్థాన-ఏ-కమాలియా బిరాదరే పీఠాధిపతి మర్హూమ్ సయ్యద్ ఇర్ఫానుల్లా హుస్సేనీ ఖాద్రి సాహెబ్ కుమార్తె నిఖా వేడుక ఆదివారం ప్రొద్దుటూరు ఆటోనగర్‌లోని ఎస్‌డీఎస్ ఫంక్షన్ హాల్‌లో ఇస్లామీయ సంప్రదాయాలు, సూఫీ ఆధ్యాత్మిక సంస్కృతి ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు.నిఖా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, మషాయిఖ్‌లు, ప్రముఖ సూఫీ గురువులు, ఉలమాలు, మత పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, భక్తులు, అభిమానులు పెద్ద...