ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రెడ్ల కళ్యాణ మండపంలో ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం

రెడ్ల కళ్యాణ మండపంలో ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

పట్టణంలోని పెన్నా నదీ తీరాన ఉన్న రెడ్ల కళ్యాణ మండపం ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చరిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.రెడ్ల కళ్యాణ మండపానికి నూతన కమిటీ ఏర్పడిన అనంతరం పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా కార్ల పార్కింగ్ స్థలాన్ని ఆధునీకరించడంతో పాటు డైనింగ్ హాల్‌లో పీఓపీ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆధునీకరించిన కార్ల పార్కింగ్ ప్రదేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 100కు పైగా మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో రెడ్ల సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్తల సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సహాయ కార్యదర్శి కొవ్వూరు రమేష్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అట్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు.కార్యవర్గ సభ్యులు రాజగోపాల్ రెడ్డి, సాకం నాగేశ్వరరెడ్డి, బండి ఆత్మకూరు వెంకటరామిరెడ్డి, రామసుబ్బారెడ్డితో పాటు సభ్యులు అన్నవరం రామ్మోహన్ రెడ్డి, కందుల మునిరెడ్డి, చిరెడ్డి లక్ష్మిరెడ్డి, ఎరువ లక్ష్మిరెడ్డి, శివరామిరెడ్డి, శివారెడ్డి, దాదు రామిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!