రెడ్ల కళ్యాణ మండపంలో ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు: పట్టణంలోని పెన్నా నదీ తీరాన ఉన్న రెడ్ల కళ్యాణ మండపం ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చరిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.రెడ్ల కళ్యాణ మండపానికి నూతన కమిటీ ఏర్పడిన అనంతరం పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఇందులో భాగంగా కార్ల పార్కింగ్ స్థలాన్ని ఆధునీకరించడంతో పాటు డైనింగ్ హాల్‌లో పీఓపీ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు...