ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సాంకేతికతతో బోధన మరింత ప్రభావవంతం

సాంకేతికతతో బోధన మరింత ప్రభావవంతం

📰 Generate e-Paper Clip

 

 

–విజయవంతంగా ముగిసిన జాతీయస్థాయి వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమం

 

సలాం   ప్రొద్దుటూరు:

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధన–అభ్యసన ప్రక్రియలో సమర్థవంతంగా అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చని ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి పేర్కొన్నారు.

 

ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “బోధన–అభ్యసన ప్రక్రియలో సాంకేతికత సమగ్రత” అనే అంశంపై ఆగస్టు 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయస్థాయి వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది.

 

ఎన్‌ఐటీటీఆర్, చెన్నై మరియు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ పాలెం గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ సాధనాలను వినియోగించడం, సాంకేతిక ఆధారిత బోధనా పద్ధతులను అవలంబించడం, విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత, అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై అధ్యాపకులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు.

 

36 మంది అధ్యాపకులకు శిక్షణ

 

ఈ కార్యక్రమంలో వివిధ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 36 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్‌గా డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ శేషుబాబు వ్యవహరించి ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక సాధనాల వినియోగం తదితర అంశాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు.

 

సీనియర్ అధ్యాపకులు పి. సురేంద్ర రెడ్డి, వెంకట మోహన్ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

 

ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులు సాంకేతికతను తరగతి గదిలో సమర్థవంతంగా వినియోగించేందుకు అవసరమైన నైపుణ్యాలు, ఆచరణాత్మక అవగాహనను పొందారు. ఆధునిక సాంకేతికతను విద్యాబోధనలో భాగం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు.

 

వారం రోజుల పాటు నిర్వహించిన ఈ జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో అధ్యాపకులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!