
ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన
సలాం మైదుకూరు:
మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డులో “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించిన నాయకులు.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. అలాగే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వార్డు ఇంచార్జ్ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే “ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం ఉద్దేశమన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి ఆసీఫ్ హుస్సేన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు శివరామ్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
