

సలాం ప్రొద్దుటూరు:
గోపురం పంచాయతీలోని బూత్ నంబర్ 215లో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అవసరమైన సూచనలు అందించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అవగాహన కల్పించడమే డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్‌తో పాటు టీడీపీ నాయకులు దేవిరెడ్డి జయరాం రెడ్డి, ఎంపీటీఆర్ శీను, యూజీఎల్ శీను, వెంకట రాముడు, పల్లె గురువిరెడ్డి, కాకిరేణిపల్లె గురువిరెడ్డి, పురుషోత్తం, మహేష్, శివ, మేస్త్రి శ్రీను, సుబ్బయ్య, రామనాథరెడ్డి, మోహన్‌రెడ్డి, కుళాయిరెడ్డి, నందు, గురువిరెడ్డి, గంగ సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

