
సలాం ప్రొద్దుటూరు:
‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆదివారం పట్టణంలోని గాంధీ పార్కులో వాకర్స్‌ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో ఆదివారం ఉదయం వాకర్స్‌ను కలిసిన ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ పథకాలను అమలు చేస్తోందని లింగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వాటి ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరూ పొందేలా చూడాలనే ఉద్దేశంతో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వాకర్స్‌తో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీకి మరింత ప్రజా మద్దతు లభిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, మాజీ కౌన్సిలర్ రామసంజీవరెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు శామీర్ భాషా, కాంట్రాక్టర్ కంభం రామాంజనేయరెడ్డి, జిల్లెళ్ల వెంకటేష్, దేశిరెడ్డి గురువిరెడ్డి, కదిరి రామకృష్ణారెడ్డి, ద్వార్శల వెంకటరెడ్డి, నాగేశ్వరావు రామేశ్వరం, గంగుల రంగారెడ్డి, గిద్దలూరు ఈశ్వరయ్య, మహమ్మద్ రఫీ, సీజే సుబ్బయ్య, క్రిష్ణయ్య తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

