ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రొద్దుటూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ప్రొద్దుటూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

📰 Generate e-Paper Clip

 

–మున్సిపల్ కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను కలిసిన వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నాగరాజు కమిషనర్‌ను కోరారు. ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య లోపాలను పూర్తిగా నివారించి, అభివృద్ధికి ఆటంకం కలిగించే అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, బాధ్యతలు చేపట్టి ఇంకా పది రోజులు కూడా పూర్తికాలేదని, అయినప్పటికీ పట్టణ అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో ప్రొద్దుటూరును రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన, పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కమిషనర్ అభివృద్ధి దృక్పథాన్ని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపుతున్న చొరవను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు అభినందించారు. అనంతరం కమిషనర్‌కు పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!