ప్రొద్దుటూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

  –మున్సిపల్ కమిషనర్ తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను కలిసిన వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తుదిక శ్రీనివాస్ విశ్వనాథ్‌ను వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్ల పోతుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నాగరాజు కమిషనర్‌ను కోరారు. ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య లోపాలను పూర్తిగా నివారించి, అభివృద్ధికి ఆటంకం కలిగించే అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి...