చిట్వేల్ దళితుల సమస్యలు పరిష్కరించాలని, ప్రజా సంఘాల ధర్నా!
సలాం ప్రొద్దుటూరు (చిట్వేల్): తిరుపతి జిల్లా చిట్వేల్ మండల దళిత గ్రామాలలో సామాజిక సర్వేలో భాగంగా, వచ్చిన సమస్యలపై, సోమవారం ఎమ్మార్వో, ఆఫీస్ వద్ద, ధర్నా నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల మండల పరిధిలోని దళిత గ్రామాలలో అనేక సమస్యలు గుర్తించడం జరిగిందని వారు తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ లో చిట్వేల్ ఎమ్మార్వో ను స్మశానాలు, రోడ్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వీధిలైట్లు, పెన్షన్లు తదితర మౌలిక వసతులు...