ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మెగా పీటీఎం విజయవంతానికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అతిథి భోజన ఏర్పాట్లు

మెగా పీటీఎం విజయవంతానికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అతిథి భోజన ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (మెగా పీటీఎం) విజయవంతానికి రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు తన వంతు సహకారం అందించింది. మునిసిపల్ హైస్కూల్, నడింపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు  రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అతిథుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలకు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విద్యాభివృద్ధికి తోడ్పడే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో సభ్యులందరూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రోటరీ క్లబ్ సభ్యులకు అధ్యక్షుడు, కార్యదర్శులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!