ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ చొరవతో ..విద్యుత్ సమస్యకు పరిష్కారం..
సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు) : మైదుకూరు మున్సిపాలిటీ 6వ వార్డులో విద్యుత్ స్తంభాలపై చెట్ల కొమ్మలు పెరగడంతో గత కొంతకాలంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులను సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ స్తంభాలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను...