ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి –ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి –ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ ,ఉద్యోగ కార్మికుల ఆకాంక్షలు నెరవేర్చేదెప్పుడో తెలియజేయాలని ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ప్రశ్నించారు.

స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 85% ఉద్యోగ కార్మికులు ప్రభుత్వ ఏర్పాటుకు ఓట్లు వేసి గెలిపించుకున్నారని బహిరంగంగా తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన రెండేళ్లలో ఉద్యోగ కార్మికుల పెండింగ్ బకాయిలైన డిఏలు సరెండర్ లీవులు ఎన్కాష్మెంట్ గ్రాటిటీలను పూర్తిగా ఇచ్చారా అని ప్రశ్నించారు గద్దెనెక్కడానికి గద్దెనెక్కిన ప్రభుత్వానికి వాటి పథకాల అమలుకు వారదులైన ఉద్యోగ కార్మికులను విస్మరించడం అన్యాయమన్నారు. 12వ పి ఆర్ సి ని తక్షణం ప్రకటించి బాధ్యతను నెరవేర్చాలని గుర్తు చేశారు అలాగే 4,196 ఎకరాలలో ఎనిమిది పారిశ్రామిక వాడలలో పారిశ్రామిక అభివృద్ధి చేపడుతామన్న ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తారా లేదా అని ప్రశ్నించారు. గడిచిన రెండేళ్లలో సుపరిపాలన అంటూ ర్యాలీలు చెప్పటం తోనే కాలయాపన చేశారు తప్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని వారన్నారు. ఆప్కస్ రద్దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫలితంగా నెలనెలా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందకుండా పోతాయని పిఎఫ్ ఈఎస్ఐ తాడ్ పార్టీ కాంట్రాక్టర్లు గతంలో కాజేసినటువంటి వారిపై ఇంతవరకు చర్యలు లేవని తిరిగి పిపిపి విధానానికి కూటమి ప్రభుత్వం తెరలేకుండా ఆపాలని వారు కోరారు. స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీ గా ఉన్నటువంటి ప్రొద్దుటూరు కార్పొరేషన్ గా అవతరించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందుకు స్వాగతిస్తున్నామని అయితే స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి తక్షణం ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియామకం చేపట్టాలని తద్వారా పరిపాలన ప్రజలకు అందించే సేవలు మరింత వేగవంతం అవుతాయని వారన్నారు. అసంఘటితరంగా కార్మికులైన ఆటో హమాలీ భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్స్ రంగ కార్మికుల వేతనాల పెంపుపై ఉద్యోగ భద్రతపై చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ఈ ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ ల పేరుతో మధ్యాహ్న భోజన కార్మికులకు ఉన్న ఉపాధిని కోల్పోయే స్థితికి తీసుకొచ్చిందని తక్షణం మెస్ బిల్లులు పెంచాలని పెండింగ్లో ఉన్నవి విడుదల చేయాలని వారు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని లేని పక్షంలో కార్మికుద్యమాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

ఈ ప్రెస్ మీట్ లో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వై హరి చైతన్య మున్సిపల్ నాయకులు బోధనం ఓబులేసు డి శ్యామ్ ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు మచ్చ శ్రీను ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ప్రమీల రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!