–సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర విద్య, ఐటీ, శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న టీడీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా వేదిక, కార్యకర్తలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే పరిశీలించి నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. నారా లోకేష్ పర్యటన విజయవంతం కావడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎర్పాట్ల పరిశీలనలో టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు సి.ఎం. సురేష్ నాయుడు, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వర రెడ్డి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
