ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్ముక్తియర్ ఆధ్వర్యంలో సర్ అవగాహన సదస్సు

ముక్తియర్ ఆధ్వర్యంలో సర్ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సదస్సుకు ప్రొద్దుటూరులోని వివిధ మసీదుల ఇమాములు హాజరయ్యారు. ముస్లిం సమాజంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో, ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేదా అపోహలు తలెత్తకుండా వారికి సరైన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్సీ ఎం.ఏ. షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఓటరు నమోదు ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తూ మైనార్టీలలో అనవసర భయాందోళనలు సృష్టించడం సరికాదని అన్నారు. ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరులోని ప్రతి ముస్లిం ఓటరు తన ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించుకునేలా టీడీపీ పార్టీ తరఫున, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమన్వయం చేస్తూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!