ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి

దోపిడీ చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

జిల్లాలో చదువు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నా కార్పొరేట్ విద్యా సంస్థ ల పై చర్యలు తీసుకోవాలని వైస్సార్సీపీ కడప జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పసుపులేటి సాయి దత్త, కమలాపురం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం డి ఈ ఓ ఆఫీస్ లో కడప జిల్లా విద్యార్థి విభాగం నాయకులతో కలిసి డి ఈ ఓ శంశుద్దిన్ వినతి పత్రం ఇచ్చారు..విద్యతో వ్యాపారం చేస్తున్న నారాయణ, శ్రీ చైతన్య,శ్రీ భాష్యం లపై చర్యలు తీసుకోవాలనీ వారు డిమాండ్ చేశారు.చదువు పేరుతో పాఠశాలల ఆవరణంలోనే పుస్తకాలు, యూనిఫామ్, షూస్, మరియు అనేక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల,లక్షలు రూపాయలు దోపిడీ చేస్తూ వ్యాపారానికి దిగబడిన ప్రవేట్ విద్యా సంస్థల పై క్రిమినల్ కేసు లు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ కోరారు.కడప నగరం లో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థ లకి ఏమాత్రం తగ్గకుండా దోచుకుంటున్నారని వివరించారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అన్ని సదుపాయాలు ఉన్నాయని మాయమాటలతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పుస్తకాలు, యూనిఫామ్, షూస్, మెయింటినెన్స్ అనే అనేక పేరుతో వేల, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు… దీనిపైన వైస్సార్సీపీ ప్రశ్నించగా అలా ఎం జరగడం లేదని అనే విధంగా వ్యవహారిస్తున్నారనీ తెలిపారు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతుండగా అడ్డుకోవడం జరుగుతుందన్నారు…దీనిని కేవలం కార్పొరేట్ వాళ్లు దోచుకుంటున్నారు మమ్మల్ని ఎవరు గమనించగలరు అనే అపోహతో ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా చదువుతో వ్యాపారం చేయడం జరుగుతుందన్నారు… వై ఎస్ ఆర్ సి యు సంఘంగా అనేక విద్యార్థి సంఘాలుగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. .. దీనిని పైన అనేకమార్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు విన్నవించుకున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారనీ వారు వివరించారు…ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి డి ఈ ఓ, జిల్లా కలెక్టర్ స్పందించి దోపిడీ చేసే ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ కడప జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పసుపులేటి సాయి దత్త, కమలాపురం నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయి కుమార్ రెడ్డి , కడప నగర ఉపా అధ్యక్షులు జబ్బార్ జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు రాయుడు ,మహేష్ , కడప నియోజకవర్గం విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి విష్ణు , విద్యార్థి విభాగం నాయకులు ప్రశాంత్ , చిట్టి బాబు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!