ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్స్కూల్ పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యం స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రత పై అవగాహన

స్కూల్ పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యం స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రత పై అవగాహన

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (ఎన్టీఆర్ జిల్లా):

కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట పట్టణం లో స్కూల్ బస్సులకు,బస్సు డ్రైవర్లకు SGS కాలేజీ గ్రౌండ్లో లో బుధవారం ఉదయం “స్కూల్ బస్సుల” “భద్రతపై”అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి సి పి. లక్ష్మీనారాయణ. ఏసిపి శ్రీనివాసరావు. ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలనే దానిపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అన్ని స్కూల్ బస్సులను ముందుగానే రిపేర్ సెక్షన్‌లో తనిఖీ చేయించి, లోపాలు ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలని కోరారు.స్కూల్. కాలేజీ యాజమాన్యాలు ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు, డ్రైవర్లు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రిపేర్ ఉన్న బస్సులను రోడ్డుపై తిప్పితే కఠిన చర్యలు తప్పవని DCP లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

డ్రైవర్ మరియు బస్సు ఫిట్‌నెస్ తనిఖీ

జగ్గయ్యపేట RTA అధికారులు రాజు,దివ్య మాట్లాడుతూ డ్రైవర్ లైసెన్స్, ఫిట్‌నెస్ మరియు బస్సు పరిస్థితిని కూడా పరిశీలిస్తారని చెప్పారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటేనే వారికి డ్రైవింగ్ అనుమతి ఇస్తామని, అనారోగ్యంతో ఉన్న డ్రైవర్లను అనుమతించబోమని స్పష్టం చేశారు.స్కూల్ పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.స్కూల్ బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలపై పలు సూచనలు చేశారు.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం, మెసేజ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాన కూడళ్ల వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, “నేను ముందుకు వెళ్లాలి, విడిగా వెళ్దాం” అని పోటీలు పెట్టుకోవడం ప్రమాదకరమని తెలిపారు.స్కూల్ బస్సు డ్రైవర్లు యూనిఫామ్ ధరించడం తప్పనిసరి అని, విద్యార్థుల పట్ల మంచిగా ప్రవర్తించాలని సూచించారు. మీ నడవడికే విద్యార్థుల్లో మార్పు తీసుకొస్తుందని అన్నారు.స్కూల్ పిల్లలను ఇంటి దగ్గర దింపేటప్పుడు ఆయాలు జాగ్రత్తగా ఉండి చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలను సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నామని గుర్తుచేశారు.విద్యార్థుల భద్రతే ప్రథమం కాబట్టి ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని.సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు. ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు.టౌన్ ఎస్ఐ. రాజు. ఆర్టిఏ అధికారి రాజు మరియు దివ్య ఫైర్ స్టేషన్ అధికారులు ఇతర పోలీస్ సిబ్బంది, కాలేజీ, స్కూల్ బస్సు డ్రైవర్లు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!