సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలో ఉన్న బేతానియా చర్చీ వ్యవహారం ఆదివారం పోలీ సస్టేషన్ కు చేరింది. ఫాదర్ ను నియమించే విషయమై చర్చీకి వచ్చిన ఫాదర్లు రెండు వర్గా లుగా విడిపోయి గొడవకు దిగడంతో వన్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. చర్చీ ప్రధాన గేటు మూసేసి ఇరు వర్గాలను స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆదివారం కావడంతో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చర్చీకి వచ్చారు. ఫాదర్ల మధ్య గొడవ కారణంగా ప్రేయర్ జరగకపోవడంతో వారు తీవ్ర అసహనానికి లోనయ్యారు. గతంలో కూడా పలు మార్లు చర్చిలో గొడవలు జరిగాయి. ఇరువ ర్గాలు స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకు న్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
