సలాం ప్రొద్దుటూరు (నార్పల):
నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం ఘర్షణ ఏర్పడి ఇరు కుటుంబాలు దాడికి దిగిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి ల మధ్య భూమి వివాదం రాజుకుంది. ఈ వివాదంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి ఇద్దరూ కలిసి నారాయణరెడ్డి కుటుంబం పై దాడి చేశారు. ఈ దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
