ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్🚨రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️ 

🚨రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️ 

📰 Generate e-Paper Clip

మేడ్చల్:

మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా… ఆ పార్సిల్‌ను చూసి రాపిడో డ్రైవర్ శ్రీ సత్తు ఆదర్శ్ కు అనుమానం వచ్చింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగల పౌరుడిగా అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.సత్తు ఆదర్శ్ ఇచ్చిన పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక డ్రగ్ పెడ్లర్ ను, ఒక డ్రగ్ కన్జ్యూమర్ ను,రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పెడ్లర్ వద్ద నుండి 1 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సత్తు ఆదర్శ్ చూపిన సమయస్ఫూర్తి, సామాజిక బాధ్యతను అభినందిస్తూ… కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ శ్రీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ (IPS) గారు ఆదర్శ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, నగదు బహుమతిని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!