సలాం ప్రొద్దుటూరు (ఉండవల్లి):
విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత దేశ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తాలిం-ఏ-హునర్’ కార్యక్రమానికి సంబంధించిన బుక్లెట్‌ను మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తున్న ఉచిత నాణ్యమైన విద్య, శిక్షణ, అలాగే కార్యక్రమం సాధించిన ఫలితాలను వివరించారు. అదేవిధంగా, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధి, డిజిటలైజేషన్, పెండింగ్ సమస్యల పరిష్కారం, విద్యా మరియు సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర నివేదికను మంత్రి నారా లోకేష్‌కు వివరించారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చేపడుతున్న సంస్కరణలు, విద్యా రంగంలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్ అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరియు సమాజ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
