సలాం ప్రొద్దుటూరు (కడప):
కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇంచార్జీ యువ నాయకుడు ఉక్కు ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కడప విమానాశ్రయంలో జరిగిన ఈ భేటీలో జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యం, స్థానిక సమస్యలు లపై ఉక్కు ప్రవీణ్ లోకేష్ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు . పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత చురుకైన పాత్ర పోషించాలని
అలాగే, జిల్లాలో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు యువత నుంచి లభిస్తున్న ఆదరణ, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయంపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ భేటీ అనంతరం ఉక్కు ప్రవీణ్ మంత్రి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియజేయగా, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా హాజరై ఆత్మీయంగా పలకరించారు.
