సలాం ప్రొద్దుటూరు (దువ్వూరు):
మైదుకూరు మార్కెట్ యార్డ్ పరిధిలోని గోదాములలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను కోరిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గోదాముల తనిఖీలను చేపట్టిన సిబ్బంది..మైదుకూరు మార్కెట్ యార్డ్ పరిధిలోని రూరల్ వేర్హౌస్ లు దువ్వూరు పరిధిలో గల మూడు గోదాములను తనిఖీ నిమిత్తం వెళ్లిన సిబ్బంది..కె ఎస్ ఆర్, గురు విజయలక్ష్మి, శ్రీ గురు రూరల్ ఫార్మర్స్ వేర్హౌస్లకు తనిఖీ నిమిత్తం వెళ్లిన యార్డ్ సిబ్బంది..ఒక గోదాములో ద్రావణం చల్లడం వల్ల రెండు రోజుల తర్వాత తనిఖీ సహకరిస్తామని తెలిపిన గోదాం యజమాని..మరో రెండు గోదాముల యజమానులు మార్కెట్ యార్డ్ సిబ్బందికి అందుబాటులోకి రాకపోవడంతో వెనుదిరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది..కనీసం గోదాముల వద్దా సెక్యూరిటీ సైతం లేకపోవడం తో అసహనం వ్యక్తం చేసిన మార్కెట్ యార్డ్ అధికారులు. .రేపటి దినం వేరహౌస్లాకు నోటీసులు జారీ చేసి తనిఖీ చేపడతామని తెలిపిన మైదుకూరు మార్కెట్ యార్డ్ ఇన్చార్జ్ సెక్రటరీ రత్నరాజు..దువ్వూరు గాయత్రి రూరల్ వేరే హౌస్ గోదాములో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి అక్రమాలు జరిగాయని తేలడంతో మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకటలక్ష్మి నీ సస్పెండ్ చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టిన సిబ్బంది..తనిఖీ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపిన మైదుకూరు మార్కెట్ యార్డ్ సిబ్బంది…తనిఖీలో పాల్గొన్న నాగేంద్ర కుమార్, సతీష్ ఇతర సిబ్బంది.
