సలాం ప్రొద్దుటూరు :
పట్టణంలోని టి బి రోడ్డు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వై ఎం ఆర్ కాలనీ పురవీదుల్లో ర్యాలీ తిరగడమైనది. ఈ ర్యాలీలో వైద్యధికారి కె. మానస గారు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదిన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం లో 0-5 సంవత్సరాలు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించి వారి బంగారు భవిష్యత్ ను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమం లో తల్లులకు అవగాహన కల్పించి 100శాతం పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత ప్రొద్దటూరు గా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత గా తీసుకోవలన్నారు. ఈ కార్యక్రమం లో టి బి సూపర్ వైజర్ బి. రాజారత్నం, సి ఓ ఎం వి సుబ్బారెడ్డి, వార్డు హెల్త్ సెక్రటరీలు, ఆశాలు, టి బి సిబ్బంది ప్రసాద్, గంగాదేవి మరియు ఆశాలు పాల్గొన్నారు.
