సలాం ప్రొద్దుటూరు :
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్దుల జాబితాలో షర్మిల పేరు లేదు. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ సీటుపై షర్మిల ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభకు అవకాశం కల్పించాంటూ ఇటీవల షర్మిల భర్త అనిల్ తో కలిసి హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జునఖర్గేతో భేటీ అయ్యారు. పార్టీలో చేరే సమయంలోనూ రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ లోకి షర్మిలను తీసుకురావడంలో అప్పటి కర్ణాటక పీసీసీ చీఫ్ ప్రస్తుత సీఎం డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గేకు అవకాశం కల్పించింది. ఖర్గేతో పాటు మరో ఇద్దరికి ఇక్కడి నుంచి అవకాశం కల్పించారు. షర్మిల ప్రతిపాదనలు పక్కన పెట్టారు. మరో వైపు రాజ్యసభ ఎన్నికలకు కర్ణాటకు నుంచి ఇవాళ మల్లిఖార్జున ఖర్గే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఇతర నేతలు హాజరు కానున్నారు.
