ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన 5వ వార్డు కౌన్సిలర్ రాకెట్...

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన 5వ వార్డు కౌన్సిలర్ రాకెట్ రఫీ!

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు –   మైదుకూరు:

మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తనయులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు  పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను మైదుకూరు 5వ వార్డు కౌన్సిలర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం ఆయనతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ పట్టణంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అంశాలపై చర్చించారు.ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా రాకెట్ రఫీ పేర్కొన్నారు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌తో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయంగా సాగిందని రాకెట్ రఫీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!