ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు..

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు..

📰 Generate e-Paper Clip

–భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం..

– క్యూలైన్లపై ప్రత్యేక నిఘా

–డీఎస్పీ బాలస్వామి రెడ్డి పర్యవేక్షణ 

సలాం  ప్రొద్దుటూరు:

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.

ప్రొద్దుటూరు డీఎస్పీ బాలస్వామి రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!