ePaper
Monday, October 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మహమ్మద్ ప్రవక్త (స అ)చరిత్రపై విద్యార్థులకు పోటీలు

మహమ్మద్ ప్రవక్త (స అ)చరిత్రపై విద్యార్థులకు పోటీలు

📰 Generate e-Paper Clip

 

–విజేతలకు బహుమతులు అందజేసిన బేపారి ఆరిఫ్

 

సలాం ప్రొద్దుటూరు – కడప:

కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త చరిత్రపై వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన 36 మంది విద్యార్థులకు ముఖ్యఅతిథి బేపారి ఆరిఫ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు , తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల్లో మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై అవగాహన పెంపొందించడంతో పాటు, నైతిక విలువలు, సత్ప్రవర్తన, మానవతా సందేశాలపై ఆసక్తి కల్పించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించారు.కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యుడు బేపారి జాకీర్, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు షేక్ ఇషాక్ అలీ, అహ్మద్ భాషా, అబ్దుల్, ఐటా సభ్యులు సయ్యద్ భాష, ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!