
–250 మంది బాలబాలికలతో జిల్లాస్థాయి NIDJAM పోటీలు విజయవంతం
సలాం ప్రొద్దుటూరు:
జిల్లాస్థాయి NIDJAM అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 13 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులోని అనిబీసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.
అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీలు
అండర్–14 బాలబాలికలకు మూడు రకాల ట్రయాథ్లాన్ పోటీలు నిర్వహించారు. ఇందులో 60 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, బ్యాక్ త్రో, 600 మీటర్ల పరుగు విభాగాలు ఉన్నాయి. అండర్–16 విభాగంలో 60 మీటర్లు, 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన గురుమా భాష, మహమ్మద్ సుఫియాన్, సాయి కృష్ణ, జయసింహ, గంగాధర్, మహమ్మద్ అయాన్, నాగరాజు, భవిత, దీపికా రెడ్డి, రిషిత, లోహిత, హబీబా, ప్రశాంతి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.వీరు నవంబర్ 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాతీయ అంతర్జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
నిర్వాహకుల అభినందనలు
పోటీల విజయవంతమైన నిర్వహణకు వ్యాయామ సంచాలకులు నాగూర్ భాష, సుబ్బయ్య, ప్రణవి, తిరుమల, చందు, సతీష్ రెడ్డి, నారాయణ, నాగేశ్వరరావు, ఖాదర్ రెడ్డి, సుధాకర్, దిలీప్, రఫీ తదితరులు సహకరించారు.ఈ సందర్భంగా భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి వై. అహమర్ భాష నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

