ePaper
Monday, September 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్రం దృష్టికి కీలక అంశాలు

ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్రం దృష్టికి కీలక అంశాలు

📰 Generate e-Paper Clip

–కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

–దువ్వూరు రోడ్డును 4-లేన్లుగా అభివృద్ధి చేయాలని, కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని విజ్ఞప్తి

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శనివారం పొట్లదుర్తి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి అవసరమైన మౌలిక వసతులు, విద్యా రంగ అభివృద్ధి, రహదారి సౌకర్యాలపై పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా దువ్వూరు రోడ్డును 4-లేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని, అలాగే ప్రొద్దుటూరుకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఈ రెండు అంశాలు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని వివరించారు.అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మిస్సింగ్ హైవే లింక్ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.నియోజకవర్గానికి అవసరమైన కీలక మౌలిక వసతుల పనులను కేంద్ర స్థాయిలో సమన్వయం చేసి పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీయం రమేష్ నాయుడు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి , ప్రముఖ న్యాయవాది ఈవీ సుధాకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, వాల్మీకి బోయ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!