ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్రం దృష్టికి కీలక అంశాలు
–కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి –దువ్వూరు రోడ్డును 4-లేన్లుగా అభివృద్ధి చేయాలని, కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని విజ్ఞప్తి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును శనివారం పొట్లదుర్తి గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి అవసరమైన మౌలిక వసతులు, విద్యా రంగ అభివృద్ధి, రహదారి సౌకర్యాలపై పలు అంశాలను కేంద్ర మంత్రి...