ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే పుట్టా పరామర్శ

చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే పుట్టా పరామర్శ

📰 Generate e-Paper Clip

 

 

–త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కుటుంబ సభ్యులకు ధైర్యం

 

సలాం   ప్రొద్దుటూరు:

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త మంగపట్నం పెద్ద సుబ్బరాయుడిని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం పరామర్శించారు.చాపాడు మండలం చాపాడు గ్రామానికి చెందిన మంగపట్నం పెద్ద సుబ్బరాయుడు అనారోగ్యానికి గురై ప్రొద్దుటూరులోని వెంకట ఆరాధ్య న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.సుబ్బరాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడవద్దని, అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఎమ్మెల్యే వెంట చాపాడు మండల టీడీపీ అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి, స్టేట్ డైరెక్టర్ అన్నవరం సుధాకర్ రెడ్డి, పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం, రాజోలి బయాపు రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!