ePaper
Tuesday, September 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేకాట స్థావరంపై వన్‌టౌన్‌ పోలీసుల దాడి

పేకాట స్థావరంపై వన్‌టౌన్‌ పోలీసుల దాడి

📰 Generate e-Paper Clip

 

–తొమ్మిది మంది అరెస్ట్‌..

–రూ.96,520 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణంలోని గిడ్డంగి వీధిలో ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్‌టౌన్‌ పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ విభు కృష్ణ తెలిపారు. సోమవారం ఏఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

 

పేకాట నిర్వాహకుడు వడ్లగండ్ల బాబుతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.96,520 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

 

పట్టణంలో జూద కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఏఎస్పీ స్పష్టం చేశారు. దాడిలో పాల్గొన్న సీఐ టి.వి. కొండారెడ్డి, ఎస్సై జి. మధుసూదన్‌రెడ్డి, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!