ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం   ప్రొద్దుటూరు:

22 వ వార్డు టీడీపీ  నాయకుడు బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా బేపారి ఆరిఫ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సామాజిక భద్రతకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని బేపారి ఆరిఫ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!