ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గండి క్షేత్రం ఉత్సవాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు

గండి క్షేత్రం ఉత్సవాలకు ట్రాఫిక్‌ ఆంక్షలు

📰 Generate e-Paper Clip

 

–వీరన్నగట్టుపల్లె వరకు భారీ వాహనాలకు అనుమతి.. మారుతినగర్‌లో పార్కింగ్

 

సలాం ప్రొద్దుటూరు – వేంపల్లె:

శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ఈ నెల 22న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆర్కే వ్యాలీ ఎస్సై శ్రీప్రియ తెలిపారు.ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. వేంపల్లె నుంచి రాయచోటి వైపు వెళ్లే భారీ వాహనాలను వీరన్నగట్టుపల్లె వరకు మాత్రమే అనుమతిస్తామని, అక్కడి నుంచి గండి క్షేత్రం వైపు భారీ వాహనాలను ముందుకు వెళ్లనివ్వబోమని తెలిపారు.అదేవిధంగా రాయచోటి నుంచి వేంపల్లె వైపు వచ్చే భారీ వాహనాలను అద్దాలమర్రి క్రాస్‌ వరకు మాత్రమే అనుమతిస్తామని ఎస్సై శ్రీప్రియ వెల్లడించారు. గండి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల కోసం వీరన్నగట్టుపల్లె గ్రామం, మారుతినగర్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల ఇబ్బందులను నివారించేందుకు పోలీసుల సూచనలు పాటించాలని భక్తులు, వాహనదారులకు ఎస్సై శ్రీప్రియ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!