గండి క్షేత్రం ఉత్సవాలకు ట్రాఫిక్ ఆంక్షలు
–వీరన్నగట్టుపల్లె వరకు భారీ వాహనాలకు అనుమతి.. మారుతినగర్లో పార్కింగ్ సలాం ప్రొద్దుటూరు – వేంపల్లె: శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా ఈ నెల 22న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆర్కే వ్యాలీ ఎస్సై శ్రీప్రియ తెలిపారు.ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. వేంపల్లె నుంచి రాయచోటి వైపు వెళ్లే భారీ వాహనాలను వీరన్నగట్టుపల్లె...