ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్అనంతపురంలో రేపు ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

అనంతపురంలో రేపు ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

📰 Generate e-Paper Clip

 

–12 కంపెనీలు.. 300 ఉద్యోగ అవకాశాలు

 

సలాం ప్రొద్దుటూరు– అనంతపురం:

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం (ఆగస్టు 18) అనంతపురములో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో సుమారు 12 కంపెనీలు పాల్గొని 300 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.ఉద్యోగ మేళా వేదిక: ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, ఉప్పరపల్లి రోడ్డు, ఆర్.డి.టి. స్టేడియం సమీపంలో, అనంతపురము.సమయం: ఉదయం 10:00 గంటల నుంచి.అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత నుంచి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వరకు విద్యార్హతలు కలిగిన వారు హాజరుకావచ్చు. పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు అర్హులు.ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమే/బయోడేటాతో ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళాకు హాజరుకావాలని ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డా. వై.వి. మల్లారెడ్డి కోరారు.నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!