సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలోని 175, 176 బూత్ ల లో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు భావనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు వార్డుల్లోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, వాటిపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, వార్డు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
