ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్22వ వార్డులో టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం

22వ వార్డులో టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం

📰 Generate e-Paper Clip

–ప్రజల వద్దకే కూటమి పాలన సంక్షేమం.. సమస్యలపై ఆరా

 

సలాం  ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం 22వ వార్డులో ఉత్సాహంగా సాగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

 

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

 

ప్రజల ముంగిటకు టీడీపీ శ్రేణులు

 

వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో నాయకులు ఇంటింటికీ వెళ్లడంతో స్థానికంగా కార్యక్రమం సందడిగా సాగింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, క్లస్టర్ ఇన్‌చార్జ్ తలారి రమేష్, బేపారి ఆరీఫ్ అహమ్మద్, బూత్ ఇన్‌చార్జి మాదూర్ మున్నా, వరపకుల ఖాదర్ బాషా, ఇనాయతుళ్ల, గౌసపీర్, సిమెంట్ అసిఫ్, పీరు, రఫీక్, అలీ, దస్తగిరి బాషా, పూల జాఫర్, ఉప్పలూరు రసూల్, అబ్దుల్లా, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!