ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఎడిటోరియల్జిల్లా అనుబంధ కమిటీల నియామకాలపై బద్వేల్ ఇంచార్జితో జబీవుల్లా భేటీ

జిల్లా అనుబంధ కమిటీల నియామకాలపై బద్వేల్ ఇంచార్జితో జబీవుల్లా భేటీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు – బద్వేల్

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ కమిటీల నియామక ప్రక్రియపై జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి సూర్యనారాయణ రెడ్డిని మంగళవారం కలిసి చర్చించారు.

 

ఈ సందర్భంగా జిల్లా అనుబంధ కమిటీల నియామకాలను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేసే అంశంపై ఇరువురు నాయకులు సమీక్షించారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, పార్టీ అధిష్ఠానం మార్గదర్శకాల మేరకు నియామక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు.

 

అలాగే పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దే దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!