జిల్లా అనుబంధ కమిటీల నియామకాలపై బద్వేల్ ఇంచార్జితో జబీవుల్లా భేటీ

సలాం ప్రొద్దుటూరు – బద్వేల్   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా అనుబంధ కమిటీల నియామక ప్రక్రియపై జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జి సూర్యనారాయణ రెడ్డిని మంగళవారం కలిసి చర్చించారు.   ఈ సందర్భంగా జిల్లా అనుబంధ కమిటీల నియామకాలను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేసే అంశంపై ఇరువురు నాయకులు సమీక్షించారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ, పార్టీ అధిష్ఠానం మార్గదర్శకాల మేరకు నియామక ప్రక్రియను సమర్థవంతంగా...