ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికి వివరించిన టీడీపీ నాయకులు

కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికి వివరించిన టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

 

 

–చాపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం

–ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ

 

సలాం ప్రొద్దుటూరు – చాపాడు:

 

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో చాపాడు మండలంలోని చాపాడు గ్రామపంచాయతీలో బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

 

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించిన టీడీపీ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామస్తుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో చాపాడు మండలంతో పాటు మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సిమెంట్ రోడ్లు, స్మశానవాటికలు, కల్వర్టులు, విద్యాసంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంకు చైర్మన్ నరసింహారెడ్డి, టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి అక్బర్ సలీం, జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల బాబు, మాజీ సర్పంచ్ అక్బర్ వలి, మైదుకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, బయాపు రెడ్డి, రవి, కిరణ్, బషుమియా, అబ్దుల్, మస్తాన్, పెద్ద సుబ్బారాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!