కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఇంటింటికి వివరించిన టీడీపీ నాయకులు
–చాపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం –ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ సలాం ప్రొద్దుటూరు – చాపాడు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో చాపాడు మండలంలోని చాపాడు గ్రామపంచాయతీలో బుధవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు చాపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ...