ePaper
Friday, July 31, 2026
ePaper
Homeరాజకీయం"అవినీతికి ఉద్యోగులు కాదు.. పాలకులే బాధ్యులు"–రాచమల్లు

“అవినీతికి ఉద్యోగులు కాదు.. పాలకులే బాధ్యులు”–రాచమల్లు

📰 Generate e-Paper Clip

–టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు

 

సలాం ప్రొద్దుటూరు:

 

రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, లంచగొండితనం, జూదం, గంజాయి వంటి అక్రమాలకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయడం సరికాదని దీనికి అసలు కారణం పాలకులే అని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.గురువారం దొరసానిపల్లె లోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పాలకుల విధానాలు, అధికార పార్టీ నాయకుల జోక్యమే ఈ పరిస్థితులకు కారణం అని చెప్పారు.

” రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనం, గంజాయి, జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ” బుధవారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి శాఖలో లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా అంగీకరించడం గమనార్హమన్నారు.

“అవినీతికి మూలం పాలకులే”

అవినీతి, అక్రమాలు, లంచగొండితనానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అని రాచమల్లు ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాలకుల ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వ వ్యవస్థలో ఎలాంటి అవినీతి జరగదన్నారు. ఉద్యోగులతో తప్పులు చేయించేది కూడా పాలకులేనని విమర్శించారు.ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో రైతులు శనగలు విక్రయించే సమయంలో మద్దతు ధర పేరుతో భారీ అవినీతి జరిగిందని రాచమల్లు ఆరోపించారు.దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల నుంచి బియ్యం అక్రమంగా మళ్లించబడుతోందని రాచమల్లు ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమాలకు గురవుతోందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను స్వాగతించిన రాచమల్లు

టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని అంగీకరించడం స్వాగతించదగ్గ విషయమని రాచమల్లు పేర్కొన్నారు. అయితే ఆ అవినీతికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదని, అధికార పార్టీ నాయకత్వం కూడా పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

జార్జి క్లబ్ వ్యవహారంపై ఆరోపణలు

ప్రొద్దుటూరులోని జార్జ్ క్లబ్‌ను తిరిగి ప్రారంభించేందుకు అధికార పార్టీ నాయకులే పోలీసులపై ఒత్తిడి తెచ్చారని రాచమల్లు ఆరోపించారు. క్లబ్ సభ్యత్వం కోసం రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారని, జూదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు జూదాన్ని అరికడతామని చెప్పిన నాయకులు ఇప్పుడు దానిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ఇంజినీరింగ్ శాఖపై ఒత్తిళ్లు

రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఎక్కువైందని ఆరోపించారు. నాణ్యతలేని పనులు జరిగినా అధికారులు బిల్లులు మంజూరు చేయాల్సిన పరిస్థితి అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే ఏర్పడిందన్నారు. ఇంజినీర్లను బలవంతంగా ఒప్పిస్తున్నారని, వారిని మాత్రమే అవినీతికి బాధ్యులుగా చూపడం సరికాదని పేర్కొన్నారు.సాంకేతిక లోపాలు ఉన్న భవనాల రిజిస్ట్రేషన్లను కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పూర్తి చేయించారని ఆయన ఆరోపించారు. సంబంధిత అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించారని అన్నారు.

గంజాయి, ఇసుక అక్రమాలపై విమర్శలు

రాష్ట్రంలో గంజాయి విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రతిరోజూ భారీ మొత్తంలో అక్రమ ఆదాయం సమకూరుతోందని ఆరోపించారు.రాష్ట్రంలో జూదం, గంజాయి, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.

“ఉద్యోగులపై నెపం వేయడం తగదు”

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే బాధ్యులను చేయడం అన్యాయమని రాచమల్లు అన్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్లే అనేక శాఖల్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పాలకులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగులపై నెపం మోపుతున్నారని విమర్శించారు.

ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి’

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాచమల్లు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పెరిగిన అవినీతి, లంచగొండితనం, మద్యం విక్రయాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరల వసూళ్లు, జూదం, గంజాయి, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై అధికార పార్టీ నాయకులను నిలదీయాలని కోరారు.ప్రజలు తిరుగుబాటు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులపై కాదని, కూటమి ప్రభుత్వం, అధికార పార్టీ నాయకత్వంపైనేనని ఆయన ఆరోపించారు.

టీడీపీ నాయకత్వంపైనే బాధ్యత అంటూ ఆరోపణ

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని రాచమల్లు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులపై నెపం మోపడం ద్వారా అసలు బాధ్యులైన పాలకులు తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందన

ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని అంగీకరించడం వాస్తవాలను ఒప్పుకున్నట్టేనని రాచమల్లు అన్నారు. అయితే ఆ అవినీతికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు కాదని, పాలకులే ప్రధాన బాధ్యులని ఆరోపించారు.

రాజీనామా చేయాలని డిమాండ్

రాష్ట్రంలో పరిస్థితులను అదుపులో పెట్టలేకపోయామని స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో, ప్రజలకు నైతిక బాధ్యతగా ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన హితవు పలికారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!