“అవినీతికి ఉద్యోగులు కాదు.. పాలకులే బాధ్యులు”–రాచమల్లు
–టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు విమర్శలు సలాం ప్రొద్దుటూరు: రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, లంచగొండితనం, జూదం, గంజాయి వంటి అక్రమాలకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయడం సరికాదని దీనికి అసలు కారణం పాలకులే అని రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.గురువారం దొరసానిపల్లె లోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పాలకుల విధానాలు, అధికార పార్టీ నాయకుల జోక్యమే...