సలాం ప్రొద్దుటూరు:
–5 గ్రామ పంచాయతీల ప్రజాభిప్రాయ సేకరణతో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ..
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదు గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన గ్రామసభలు, ఇంటింటి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో అధిక శాతం గ్రామస్థులు విలీనానికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంత వాతావరణంలో పూర్తికాగా, అధికారులు నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నారు. విలీనంతో గ్రామాలకు మెరుగైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి పట్టణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ప్రజల సానుకూల స్పందనతో విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించగా, భవిష్యత్తులో ప్రొద్దుటూరు కార్పొరేషన్ హోదా దిశగా మరో కీలక ముందడుగు పడినట్లుగా భావిస్తున్నారు.
