ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeతెలంగాణజూబ్లీహిల్స్ సీఐ పై సస్పెన్షన్ వేటు

జూబ్లీహిల్స్ సీఐ పై సస్పెన్షన్ వేటు

📰 Generate e-Paper Clip

 

 

–మహిళ ఫిర్యాదుపై అంతర్గత విచారణ అనంతరం చర్యలు..

–ఆరోపణలను ఖండించిన సీఐ

 

సలాం ప్రొద్దుటూరు ( హైదరాబాద్):

విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ యు. శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళతో సీఐ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వాటిని చూపిస్తూ పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని, బలవంతంగా గర్భస్రావం చేయించారని బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు తీవ్ర స్వభావం కలిగినవిగా గుర్తించడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

 

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను సీఐ శ్రీనివాసులు రెడ్డి ఖండించినట్లు తెలిసింది. సదరు మహిళే తనను పలుమార్లు బెదిరించి డబ్బు వసూలు చేసిందని ఆయన ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

 

ఈ ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!