ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ ఎన్‌జీఓస్ మెడికల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఆహ్వానం

ఏపీ ఎన్‌జీఓస్ మెడికల్ క్యాంప్‌కు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఆహ్వానం

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

ఏపీ ఎన్‌జీఓస్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుధవారం ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ను కలిసి, ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో ఆగస్టు 19న నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంప్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ, తప్పకుండా కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి టీ. శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి డి. పద్మనాభరావు, రాజశేఖర్, ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు రామసుబ్బయ్య, కార్యదర్శి ప్రమీల, సహాధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు నాగార్జున, వరప్రసాద్, సంయుక్త కార్యదర్శులు నారాయణరాజు, సుబ్బారాయుడు, సచివాలయ ఉద్యోగులు పీరయ్య, ఓంకార్, జిల్లా జేఏసీ నాయకుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!