ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రధాని నరేంద్ర మోడీ 

ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రధాని నరేంద్ర మోడీ 

📰 Generate e-Paper Clip

 

 

–కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్

సలాం ప్రొద్దుటూరు (కడప):

 

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. కడపలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ యువత, విద్యార్థుల ముందు నియంతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం తల వంచక తప్పలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, మత విద్వేష పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎనిమిది వందల నగరాలు, పట్టణాలు గ్రామాలలో ఆగ్రహ వేషాలు ప్రదర్శిస్తూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చినట్లు వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, దేశవాసులు తీవ్ర నిరసనలు, ఆగ్రహ వేషాలు, ఆందోళనలు చేశారన్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ సమస్య పూర్తిగా సమసి పోలేదన్నారు. పార్లమెంటు ఆవరణలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సీఎం గా గుజరాత్ లో ఏ విధంగా చేశారో అదే విధంగా జంతర్ మంతర్ లో పోరాటం చేస్తున్న విద్యార్థులు, యువతను ఉరితీసి కిందికి వేలాడదీసి యువతకు గుణపాఠం నేర్పాలని మీడియాతో చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీస్ గోయల్ ఈ విధంగా దేశ యువతను ఉద్దేశించి ఒక కిరాతకుడిలా మాట్లాడడం పై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయ న్నారు. సదరు మంత్రి పీయూష్ గోయల్ ధమనకాండ ప్రకటనతో భారతీయ జనతా పార్టీ నాయకులు, మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల వైఖరి ప్రజలకు పూర్తిగా బహిర్గతమైందన్నారు. కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న యువతను అణిచివేసేందుకు హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయిలో పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలను దుర్వినియోగం చేశారన్నారు. వందల మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అంతేకాకుండా సాయిల్ అనే విద్యార్థి కన్ను పోయి, అతడి శరీరమంతా పెల్లెట్ గన్స్ తో కాల్చడం వల్ల బాధపడుతున్న రాహుల్ గాంధీ మీడియా ముందు వెల్లడించారన్నారు. దీనికి హోంమంత్రి అమిత్ షా పూర్తిగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాల పాటు భారతదేశాన్ని సర్వం నాశనం చేసిన నరేంద్ర మోడీ, అమిత్ షా కు రాబోయే రోజుల్లో ప్రజలు భరతవాక్యం పలుకుతారని హెచ్చరించారు. విద్యార్థులపై దమనకుండా కొనసాగించిన హోం మంత్రి అమిత్ షాను కూడా వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, మేధావులు అన్ని వర్గాల వారు చైతన్యవంతులై ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో భాగస్వాములు కావడంతో నరేంద్ర మోడీ బెంబేలెత్తిపోయి అధికారం చేజారకుండా అపసోపాలు పడుతున్నాడని ఎద్దేవా చేశారు. మరె ంతో కాలం హోంమంత్రి అమిత్ షా,ప్రధాని నరేంద్ర మోడీ మనుగడ సాధించలేరని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ మయాన రహమతుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రతినిధి ఆబిద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!